‘నేల టిక్కెట్టు’ గెస్ట్‌గా ప‌వ‌న్‌.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

Wed,May 2, 2018 10:37 AM
director denies nela ticket rumors

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ, స్టైలిష్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల కాంబినేష‌న్‌లో నేల టిక్కెట్టు అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. మాళవిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోండ‌గా జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్‌, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్‌ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'ఫిదా'ఫేం శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం, ఛోటా కే ప్రసాద్‌ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మే 24న మూవీని థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే చిత్ర ఆడియో వేడుక మే 12న జ‌రుగుతుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై స్పందించిన ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లోనే నేల టిక్కెట్టు ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఏ వార్త‌లు నిజం కాద‌ని క‌ళ్యాణ్ కృష్ణ అన్నారు.


2580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles