నేల టిక్కెట్టు ఆడియో వేడుక‌కి గెస్ట్‌గా ప‌వ‌ర్ స్టార్‌

Sat,May 5, 2018 08:21 AM
director confirms the chief guest of nela ticket

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ, స్టైలిష్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల కాంబినేష‌న్‌లో నేల టిక్కెట్టు అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. మాళవిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోండ‌గా జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్‌, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్‌ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'ఫిదా'ఫేం శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం, ఛోటా కే ప్రసాద్‌ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మే 24న మూవీని థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే చిత్ర ఆడియో వేడుక మే 12న జ‌రుగుతుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై స్పందించిన ద‌ర్శ‌కుడు త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌న్ని వెల్ల‌డిస్తామ‌ని అన్నారు. అన్న‌ట్టుగానే ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా నేల టిక్కెట్టు ఆడియో వేడుక‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు అవుతున్నార‌ని తెలిపాడు. మే 10న ఈ ఆడియో వేడుక కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ని అభిమానుల‌కి క్లారిటీ ఇచ్చారు. ర‌వితేజ మూవీ ఆడియో వేడుక‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్‌గా వ‌స్తున్నార‌ని చెప్ప‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేవు. ఏదేమైన స్టార్ హీరోల సినిమా వేడుక‌కి మ‌రో స్టార్ హీరో రావ‌డం అనే ట్రెండ్ మ‌హేష్ మొద‌లు పెట్టగా ఇది కంటిన్యూ అవుతుంద‌నే చెప్పాలి.1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS