బాలీవుడ్ చిత్రంలో నాగ్ తో జోడీ కట్టేదెవరో తెలుసా ?

Tue,July 17, 2018 03:39 PM
Dimple Kapadia to star opposite To Nagarjuna in Brahmastra

తెలుగులో మంచి స్టార్ డం సంపాదించుకున్న నాగ్ పదిహేనేళ్ళ తర్వాత బాలీవుడ్ చిత్రం చేస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్రా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు నాగ్. ప్రస్తుతం బ్రహ్మస్త్రా చిత్ర సెకండ్ షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతుండగా, రీసెంట్ గా టీంతో కలిసారు నాగ్. చిత్ర యూనిట్ తో కలిసి నాగ్ దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా కూడా మారిన సంగతి తెలిసిందే.

బ్రహ్మస్త్రా చిత్రంలో నాగ్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుండగా, ఆయన సరసన డింపుల్ కపాడియా నటిస్తుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. గత మూడేళ్ళ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న డింపుల్ ఇప్పుడు బ్రహ్మస్త్రా చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి. ఈ మూవీలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుండగా, జూలై 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు. 2003లో ‘ఎల్.ఓ.సి.కార్గిల్’ అనే హిందీ చిత్రంలో నటించిన నాగార్జున పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. నాగ్ ప్రస్తుతం దేవదాస్ అనే మల్టీ స్టారర్తో పాటు ఓ మలయాళ చిత్రంతో బిజీగా ఉన్నట్టు సమాచారం.

2260
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS