వాల్మీకి చిత్రంలో ఐటెం సాంగ్స్ చేయ‌నున్న తెలుగమ్మాయి

Fri,July 26, 2019 10:28 AM
Dimple Hayathi special song in valmiki

వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం వాల్మీకి. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్, టీజ‌ర్స్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైనర్‌ని అందిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. క్రూరమైన లుక్‌తో, గుబురు గడ్డం.. మాసిన జుట్టుతో కళ్లకు కాటుక పెట్టుకుని, ముఖంపై గాట్లుతో క‌రుడు గ‌ట్టిన వ్య‌క్తిలా వ‌రుణ్ అద‌రగొడుతున్నాడు . మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది. వాల్మీకి చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించిన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles