క‌న్న‌డ డెబ్యూ ఇవ్వ‌నున్న తెలుగ‌మ్మాయి

Fri,August 23, 2019 08:58 AM
dimple all set for Kannada debut

ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించిన డింపుల్ హ‌య‌తి అనే తెలుగు అమ్మాయి ప్ర‌స్తుతం వాల్మీకి చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోని మేక‌ర్స్ చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ అమ్మ‌డికి శాండ‌ల్‌వుడ్‌లో త‌న అదృష్టం ప‌రీక్షించుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్రముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు చంద్ర‌మౌళి.. దేవి 2లో డింపుల్ ప‌ర్‌ఫార్మెన్స్ న‌చ్చి త‌న తాజా చిత్రం కోసం ఎంపిక చేశాడు. క‌న్న‌డ మూవీలో డింపుల్ ప్ర‌ధాన పాత్ర చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ నేర్చుకునే ప‌నిలో బిజీగా ఉంది డింపుల్ హ‌య‌తి. మ‌రోవైపు వాల్మీకి చిత్రంలోను మాస్ స్టెప్పులతో అద‌ర‌గొట్టిన డింపుల్ హ‌య‌తి రానున్న రోజుల‌లో తెలుగులోను మంచి ఆఫ‌ర్స్ సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు.

2528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles