మూడు నెలల్లో మూడు సినిమాలు

Tue,May 15, 2018 11:53 AM
Dilraju to releases 3 movies in next 3 months

హైదరాబాద్ : గతేడాది డబుల్‌హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు. వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న ఈ టాప్ ప్రొడ్యూసర్ ఈ సంవత్సరం కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడుమీదున్నారు. రాబోయే మూడు నెలల్లో మూడు సినిమాలతో ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రామ్‌తో చేస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ ఫస్ట్ లుక్ విడుదలైంది. రాజ్‌తరుణ్‌తో చేస్తున్న ‘లవర్’ మూవీ జులైలో విడుదల కానుంది. ఆ తర్వాత నితిన్ నటిస్తున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు మూవీస్ తర్వాత హలో గురు ప్రేమ కోసమే చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్‌రాజు. ఈ ఏడాది కూడా ఫీల్ గుడ్ సినిమాలతో ఆడియెన్స్‌కు వినోదాన్ని అందించాలని ఫిక్స్ అయ్యారు దిల్‌రాజు.

2402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles