రవితేజ కుమారుడిపై దిల్ రాజు ప్రశంసలు

Wed,October 18, 2017 09:56 PM
dilraju praises Mahadhan in success meet


హైదరాబాద్ : రవితేజ కుమారుడు మహాధన్ పై ప్రశంసలు కురిపించాడు నిర్మాత దిల్ రాజు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాజా ది గ్రేట్’ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ రవితేజ కుమారుడు మహాధన్ ఈ సినిమాకు బోనస్. ఈ సినిమాలో చేయడానికి రవితేజ ఒప్పుకుంటాడా..? అని అడిగితే, ఎందుకు సర్ నేను ఒప్పిస్తానని అనిల్ చెప్పాడన్నారు. థియేటర్ లో చూస్తుంటే మరో హీరో పుట్టేశాడనిపించింది. మహేశ్ బాబు ఎలా అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారో మహాధన్ కూడా సినీ కెరీర్ లో అదే విధంగా రాణిస్తాడని దిల్ రాజు తెలిపారు. రవితేజ నటన, అనిల్ రావిపూడి ఎంచుకున్న కథ చాలా బాగున్నాయి. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి సక్సెస్. నాలుగైదు రోజుల్లో రవి రికార్డులన్నీ అధిగమిస్తాడని చెప్పాడు. రాజా ది గ్రేట్ చూసిన తర్వాత ఈ సినిమా నచ్చేలేదనే ప్రేక్షకుడు ఒక్కడు కూడా ఉండడని ధీమా వ్యక్తం చేశాడు దిల్ రాజు.

3114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS