కుదుట‌ప‌డుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం

Thu,October 11, 2018 10:08 AM
dilip kumar health is in stable

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్(95) ఆ మ‌ధ్య‌ ఛాతి ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిట‌ల్‌లో చేరి కొద్ది రోజుల త‌ర్వాత డిశ్చార్జ్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా న్యుమోనియాతో బాధపడుతూ మరోసారి లీలావతి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాలు తీస్తుండ‌గా, దిలీప్ బంధువు ఫైజ‌ల్ ఫ‌రూఖి దిలీప్ కుమార్ ట్విట్ట‌ర్ ఎకౌంట్ ద్వారా హెల్త్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. దేవుడు క‌రుణించాడు. ఆయ‌న వైద్యానికి స‌హ‌క‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. వీలైతే రేపు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అవుతార‌ని అన్నారు. బాలీవుడ్‌లో అగ్రనటుల్లో ఒకరిగా వెలుగొందిన దిలీప్ కుమార్ 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ , 2015లో పద్మ విభూషన్ అవార్డులను అందుకున్నారు. దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం కిలా కాగా ఇది1998 సంవ‌త్స‌రంలో విడుద‌లైంది.

699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS