ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన దిలీప్ కుమార్

Fri,October 12, 2018 10:33 AM
Dilip Kumar Discharged From Hospital

మొఘ‌ల్‌-ఎ-ఆజ‌మ్ న‌టుడు దిలీప్ కుమార్ (95) న్యుమోనియాతో బాధపడుతూ ఆదివారం రాత్రి లీలావతి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాలు తీస్తుండ‌గా, దిలీప్ బంధువు ఫైజ‌ల్ ఫ‌రూఖి దిలీప్ కుమార్ ట్విట్ట‌ర్ ఎకౌంట్ ద్వారా హెల్త్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. దిలీప్ ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన‌ట్టు తెలియ‌జేసిన ఫైజ‌ల్ వైద్యుల స‌ల‌హా మేర‌కు దిలీప్ కుమార్ కొన్నాళ్ళు ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నార‌ని చెప్పాడు. ఇన్‌ఫెక్ష‌న్ సోకకుండా ఉండేందుకు వైద్యులు ఈ సూచ‌న చేశారని ఆయ‌న అన్నాడు. బాలీవుడ్‌ అగ్రనటుల్లో ఒకరిగా వెలుగొందిన దిలీప్ కుమార్ 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ , 2015లో పద్మ విభూషన్ అవార్డులను అందుకున్నారు. దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం కిలా కాగా ఇది1998 సంవ‌త్స‌రంలో విడుద‌లైంది. ఇక గురువారంతో దిలీప్ కుమార్- సైరా భానుల వైవాహిక జీవితం 52 ఏళ్ళు పూర్తి చేసుకోగా, సైరా భాను త‌న ట్విట్ట‌ర్‌లో ఫేవ‌రేట్ ఇమేజ్‌ని షేర్ చేసి త‌న సంతోషాన్ని పంచుకుంది.

931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles