లీలావతి హాస్పటల్లో దిలీప్ కుమార్

Wed,September 5, 2018 04:51 PM
Dilip Kumar admitted to Lilavati hospital

ముంబై : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ మళ్లీ హాస్పటల్లో చేరారు. ముంబైలోని లీలావతి హాస్పటల్‌కు ఆయన చికిత్స పొందుతున్నారు. ఛాతి ఇన్ఫెక్షన్ వల్ల ఆయన అనారోగ్యంతో ఉన్నారు. దిలీప్ కోలుకుంటున్నారని, ఆయనకు మీ ఆశీస్సులు కావాలని ఫైసల్ ఫారూకీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు. గత ఏడాది కూడా దిలీప్ ఓ వారం రోజుల పాటు హాస్పటల్లో ఉన్నారు. 1994లో దాదా సాహెబ్ ఫాల్కే, 2015లో పద్మ విభూషన్ అవార్డులను అందుకున్నారు. దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ నటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

1852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles