దువ్వాడ కలెక్షన్లపై రేగిన వివాదం.. వివరణ ఇచ్చిన నిర్మాత

Wed,July 12, 2017 03:09 PM
DIL RAJU clarity on duvvada rumour

సినిమా హీరోలకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వాళ్లు తమ అభిమాన హీరోని ప్రాణాధికంగా చూసుకుంటారు. దేవుడిలా పూజిస్తారు. ఆరాధిస్తారు. ఆ హీరోను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు సహించలేరు. టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్క‌రికి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికైతే కోట్లలోనే ఫ్యాన్స్ ఉన్నారు. వారి మనోభావం కొంత దెబ్బతినే సంఘ‌ట‌న‌ తాజాగా ఒకటి జరిగింది.

అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' బాక్సాఫీస్ వద్ద హిట్ పెరేడ్ చేస్తోంది . అయితే రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు కార్యాలయం వద్ద మెగా అభిమానులు ఆందోళన చేశారు. చిరంజీవి సినిమా 'ఖైదీ నంబర్ 150' కంటే ఎక్కువ కలెక్షన్లు 'డీజే'కు వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటిస్తున్నారంటూ మెగా అభిమానులు ఆందోళన చేశారు. కలెక్షన్ల లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు.

మెగా ఫ్యాన్స్ ఆందోళనపై దిల్ రాజు స్పందించాడు. చిరంజీవి రేంజ్ చాలా ఎక్కువని.. ఆయన రేంజ్ ఎన్నటికీ తగ్గదని చెప్పాడు. కొందరు కావాలని వివాదాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారని దిల్ రాజు అభిప్రాయపడ్డాడు. అసలు చిరంజీవి సినిమాకి, డీజే సినిమాకు పోలిక లేదని, అలా లింక్ పెట్టడం మంచిది కాదని సలహా ఇచ్చాడు. అసలు చిరంజీవి వల్లే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటివారు వచ్చారని అన్నాడు. చిరంజీవి ప్రస్తావన లేకుండా ఏ ఫంక్షన్ కూడా జరగదని దిల్ రాజు వివరణ ఇచ్చాడు.

2292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles