ప్ర‌స్థానం నుండి రొమాంటిక్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Tue,September 10, 2019 12:33 PM
Dil Dariyan song from Prassthanam

బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ హీరోగా ప్ర‌స్థానం అనే తెలుగు మూవీ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శర్వానంద్‌ హీరోగా 2010లో వ‌చ్చిన ‘ప్రస్థానం’ చిత్రాన్ని హిందీలోకి అనువ‌దిస్తున్నాడు సంజ‌య్ ద‌త్‌. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. ఈ మూవీ గ్రామాల‌తో పాటు దేశంలో రాజ‌కీయాల‌ని డిఫ‌రెంట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు తెలుగు చిత్రం ప్ర‌స్థానంని హిందీలోను అదే పేరుతో దేవాక‌ట్ట‌నే తెరకెక్కిస్తున్నాడు. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా దిల్ ద‌రియాన్ అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో అలీ ఫాజ‌ల్‌, అమైరా ద‌స్తూర్‌ల రొమాన్స్ అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, మ‌నీషా కోయిరాల‌, అమైరా ద‌స్తూర్‌, అలీ ఫాజ‌ల్, స‌త్య‌జిత్ దుబే, చుంకీ పాండే ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. రీమేక్‌లో సాయికుమార్ పాత్ర‌ని సంజయ్ దత్, శ‌ర్వానంద్ పాత్రని అలీ ఫాజ‌ల్‌ పోషిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles