ట్రిపుల్ హెచ్ నోట అమితాబ్ డైలాగ్

Tue,October 17, 2017 02:56 PM
ట్రిపుల్ హెచ్ నోట అమితాబ్ డైలాగ్

న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఇండియన్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ కూడా భారత సంతతికి చెందిన జిందర్ మహల్ అన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా అతడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిశాడు. ఇప్పుడు మరో సూపర్‌స్టార్ ట్రిపుల్ హెచ్ కూడా తన ఇండియా టూర్‌పై ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. డిసెంబర్‌లో ఈ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఢిల్లీకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ హెచ్ బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పాడు. నిజానికి ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఒక్కో పదం చెబుతుంటే.. అతను అతి కష్టంగా పలికాడు. రిష్తే మె తో హమ్ తుమారే బాప్ లగ్తే హై.. మేరా నామ్ హై ట్రిపుల్ హెచ్ అంటూ అతను చెప్పిన డైలాగ్ ఇండియన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నది.

1525

More News

VIRAL NEWS