ధ్రువ నట్చత్తిరమ్ లేటెస్ట్ టీజ‌ర్‌

Tue,June 5, 2018 12:37 PM
Dhruva Natchathiram  Official Teaser released

వర్సటైల్ యాక్టర్ విక్రమ్- క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ధ్రువ నక్షత్రం( త‌మిళంలో ధ్రువ నట్చత్తిరమ్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ళి చాలా రోజులే కావొస్తున్నా, రిలీజ్ డేట్ విష‌యంలో మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ సినిమాపై అమితాసక్తిని క‌లిగిస్తున్నాయి. ఇందులో జాన్ అనే గూడా చారి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. తాజాగా మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్న విక్ర‌మ్.. అభిమానులకి కావ‌ల‌సినంత వినోదాన్ని అందించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. టీజర్‌లో సంగీత హ‌రీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పార్తీప‌న్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, సిమ్రాన్‌, డీడీ, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. విక్ర‌మ్ మ‌రో చిత్రం సామి 2 ట్రైల‌ర్ తాజాగా విడుద‌లై నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

2382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS