ఫ్యాన్ మేడ్ పోస్టర్ కి ఫిదా.. సోషల్ మీడియాలో షేర్ చేసిన విక్రమ్

Wed,November 15, 2017 11:43 AM
Dhruva Natchathiram fan made poster

ఈ రోజుల్లో సినీ సెలబ్రిటీలపై అభిమానుల అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి స్టార్ హీరోలపై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, అభిమానాలు వారి కుటుంబ సభ్యులపై కూడా అంతగా ఉండవేమో అనిపిస్తుంది. తాజాగా కోలీవుడ్ అభిమాని ఓ పోస్టర్ తో తన అభిమాన హీరోపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. విక్రమ్ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ నట్చత్తిరమ్. ఇందులో జాన్ అనే గూడా చారి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఓ అభిమాని ధ్రువ నట్చత్తిరమ్ టైటిల్ తో పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ విక్రమ్ కి ఎంతగానో నచ్చడంతో , దీనిని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ ని చూసిన జనాలు అందరు అచ్చం ఒరిజినల్ పోస్టర్ లానే ఉందని కామెంట్స్ పెడుతున్నారు . స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ధ్రువ నట్చత్తిరమ్ వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. విక్రమ్ సామి 2 అనే చిత్రం కూడా చేస్తున్నాడు.

1305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles