త‌మిళ అర్జున్ రెడ్డి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,September 23, 2018 09:08 AM
dhruv movie first look released

ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీ త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ అవుతుంది. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి గెటప్ లో ధృవ్ లుక్ ఒకటి బయటకి రాగా, ఇది అభిమానులని ఎంతగానో అలరించింది. తాజాగా ధృవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో క‌థానాయిక మేఘా చౌద‌రిని బైక్‌పై ఎక్కించుకొని ధృవ్ స్పీడ్‌గా దూసుకెళుతున్న‌ట్టు కనిపిస్తుంది. ఉద‌యం 11గం.ల‌కి చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వరీరావుని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

3426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles