రేస్ 3 స్పెషల్ స్క్రీనింగ్‌కి ధోనీ, సాక్షి

Wed,June 13, 2018 04:04 PM
Dhoni and Sakshi watched Race 3 special screening

సల్మాన్ ఖాన్ స్టారర్ రేస్ 3 మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకుముందే సెలబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సల్మాన్ తన క్లోజ్ ఫ్రెండ్స్‌ను పిలిచాడు. బాలీవుడ్ స్టార్లతోపాటు క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ, అతని భార్య సాక్షి కూడా ఈ స్క్రీనింగ్ చూడటానికి వచ్చారు. సల్మాన్, ధోనీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. గతేడాది డిసెంబర్‌లో సల్మాన్ 52వ పుట్టిన రోజుల వేడుకలకు కూడా ధోనీ హాజరయ్యాడు. రేస్ 3లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, అనిల్ కపూర్, డైరెక్టర్ రెమో డిసౌజా కూడా స్క్రీనింగ్‌కు వచ్చారు. మరోవైపు రేస్ 3 రిలీజ్‌కు ముందే రికార్డులు బద్ధలు కొట్టింది. కేవలం శాటిలైట్ రైట్స్ ద్వారానే సినిమాకు రూ.130 కోట్లు రావడం విశేషం. గతంలో ఏ బాలీవుడ్ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంత మొత్తం పలకలేదు. దంగల్ రికార్డును రేస్ 3 బ్రేక్ చేసింది. సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టిన మొత్తం ఇప్పటికే ప్రొడ్యూసర్స్‌కు వచ్చేసింది. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లతో ఇప్పటికే రేస్ 3 ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈద్ కానుకగా 15వ తేదీన సినిమా రిలీజ్ కానుంది.

1553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS