'హ్యాపి వెడ్డింగ్' సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Thu,July 5, 2018 01:03 PM
Dheemthana Thomthana Song Teaser released

సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డెబ్యూ డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ క‌ర్య తెర‌కెక్కిస్తున్న చిత్రం హ్యాపి వెడ్డింగ్‌. మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి అనే డైలాగ్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక తాజాగా దీంత‌న తోంత‌న అనే సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. కుటుంబ స‌భ్యులంద‌రు క‌లిసిన వేడుక‌లో సాగిన ఈ పాట అల‌రిస్తుంది. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS