ఫాంహౌస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చాలనుకుంటున్న హీరో

Fri,June 22, 2018 03:11 PM
Dharmendra farmhouse to be turns as 100-acre Hotel?

బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు ముంబైలోని లోనావాలా ప్రాంతంలో ఓ ఫాంహౌస్ ఉన్న విషయం తెలిసిందే. ధర్మేంద్ర సేద తీరాలనుకున్నప్పుడల్లా ఫాంహౌస్‌కు తరచూ వస్తుంటారు. ఈ ఫాంహౌస్‌లో ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.

విశాలంగా ఉండే ఫాంహౌస్‌ను వాణిజ్య అవసరాల పరంగా మరింత విస్తరించాలనుకుంటున్నారట సన్నీడియోల్, బాబీడియోల్. ఫాంహౌస్ ను 100 కోట్ల విలువైన లగ్జరీ హోటల్ గా మార్చాలనుకుంటున్నట్లు రేస్ 3 సినిమా సక్సెస్ మీట్‌లో తెలిపాడు బాబీడియోల్. ఫాంహౌస్‌ను ఆధునీకరించే విషయంపై చర్చిస్తున్నామని బాబీడియోల్ చెప్పాడు. బాబీడియోల్, సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన రేస్ 3 సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

2313
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles