ధ‌నుష్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.. ట్రైల‌ర్ లో మ‌ళ్లీ ఇర‌గ‌దీశాడు!

Mon,June 26, 2017 12:18 PM
Dhanush VIP2 Trailer Released

2014 లో ర‌ఘువ‌ర‌న్ బీటెక్ మూవీ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ధ‌నుష్ ఇప్పుడు మ‌ళ్లీ అదే మూవీ కొన‌సాగింపుగా వీఐపీ2 గా వ‌స్తున్నాడు. వీఐపీ అంటే వెరీ ఇంపార్టెంట్ ప‌నిలేనివాడు అని అర్థ‌మ‌ట‌. త‌మిళ్, తెలుగు లో వ‌స్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ ఆదివారం రిలీజ‌యింది. నాపేరు ర‌ఘువ‌ర‌న్.. నేనిప్పుడు వెరీ ఇంపార్టెంట్ ప‌నిలేనోడిని అంటూ స్టార్టయ్యే ట్రైల‌ర్ లో పంచ్ డైలాగులు మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. ఇక‌.. ఈ మూవీ లో బాలీవుడ్ అందాల తార కాజోల్ విల‌న్ గా న‌టించ‌డం విశేషం. కాజోల్, ధ‌నుష్ మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. నేను పులికి తోక‌లా ఉండ‌టం క‌న్నా.. పిల్లికి త‌ల‌లా ఉంటా.. అంటూ ధ‌నుష్ చెప్పే డైలాగ్ కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పెళ్లి చూపులు ఫేం రీతూ వ‌ర్మ ఈ మూవీలో స్పెష‌ల్ రోల్ చేస్తున్న‌ది. ఈ మూవీకి ర‌జినీ కూతురు సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న‌ది. ఇక‌.. త్వ‌ర‌లోనే మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తెలుగు ట్రైల‌ర్


త‌మిళ్ ట్రైల‌ర్

2270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles