త‌న సినిమాకి వినూత్న ప్ర‌మోషన్స్ చేసుకుంటున్న ధ‌నుష్‌

Wed,October 10, 2018 12:07 PM
dhanush makes variety promotions for vada chennai

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు ఇలా అన్ని రంగాల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని అభిమానుల మ‌న‌స్సులు దోచుకున్నాడు ధ‌నుష్‌. ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌డ‌చెన్నై చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఐశ్వ‌ర్య రాజేష్‌, అందేరా జ‌రేమియాలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కిషోర్ కుమార్, స‌ముద్ర‌ఖ‌ని, డేనియ‌ల్ బాలాజీ, అమీర్‌లు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నార్త్ మ‌ద్రాస్ కి చెందిన గ్యాంగ్ స్ట‌ర్ నేష‌న‌ల్ క్యారెమ్ ప్లేయ‌ర్‌గా ఎలా మారాడ‌నే క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. వ‌డ చెన్నై చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా, అతి త్వ‌ర‌లోనే మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే చిత్రానికి సంబంధించి వెరైటీ ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నాడు ధ‌నుష్‌. ఇటీవ‌ల త‌మిళ చిత్రం వ‌డ చెన్నై కోసం ఎంతో మంది శ్రామికులు కొన్ని నెల‌ల పాటు జైలు సెట్‌ని త‌యారు చేశారు. దీనికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. తాజాగా ఓ వాడ‌కి సంబంధించిన సెట్‌ని రూపొందించ‌డం ఎలా అనేది మేకింగ్ వీడియోలో చూపించారు. సెట్ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ అభిమానుల‌లో సినిమాపై అంచ‌నాలు పెంచుతున్న ధ‌నుష్‌, ఈ మూవీతో మ‌రో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడ‌ని అంటున్నారు.

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles