ఎంజీఆర్ సినిమా టైటిల్‌పై క‌న్నేసిన ధ‌నుష్‌

Sat,September 7, 2019 12:09 PM
Dhanush Film To Have MGRs Title

త‌మిళ హీరో ధనుష్ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉన్నాడు. ఇటీవ‌ల మారి2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ రీసెంట్‌గా అసుర‌న్ చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ రేపు రిలీజ్ చేయ‌నున్నారు. ఇక కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ఆ మ‌ధ్య ప్ర‌క‌టించారు.లండ‌న్‌లో కొద్ది రోజుల పాటు చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ఈ మూవీ గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రానికి ఎంజీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఉల‌గం సుత్రుం వ‌లిబ‌న్ అనే టైటిల్‌ని వాడాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ, జోజు జార్జ్‌, జేమ్స్ కాస్మో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానుంది.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles