ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్‌.. టైటిల్ ఫిక్స్

Sat,October 20, 2018 11:07 AM
dhanush directs nagarjuna

టాలీవుడ్ న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున మ‌ల్టీ స్టార‌ర్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్న‌ట్టు తెలుస్తుంది. నాగ్ న‌టించిన ఊపిరి, దేవ‌దాస్ వంటి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కి మంచి క్రేజ్ రావ‌డంతో ప్ర‌స్తుతం ధ‌నుష్‌తో క‌లిసి మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. బ‌హుబాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ధ‌నుష్ తెర‌కెక్కించ‌నుండ‌గా ఇందులో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు,ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి నాన్‌ రుద్రన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్‌లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, ధ‌నుష్ న‌టించిన ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా, మారి–2 చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధం కాగా, వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఇది వెక్కై అనే నవల ఆధారంగా సినిమా చేయ‌నున్నట్టు స‌మాచారం. ఇక స‌త్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ధనుష్‌ నటించనున్నారట. యువ దర్శకుడు రామ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ ధనుష్‌ ఒక చిత్రం చేయనున్నారు. ఏదేమైన న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ధ‌నుష్ రాణించ‌డం గొప్ప విశేషం.

2099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS