ఆ పాటని అరగంటలోనే పూర్తి చేసిన ధనుష్

Fri,July 22, 2016 07:23 AM
dhanush completes the song in 30 minutes

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తిక్క. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఈ సినిమాలోని ఓ పాటను తమిళ స్టార్ ధనుష్‌తో పాడించాడు. తిక్క బేబి అంటూ సాగే ఈ పాటని ధనుష్ కేవలం 30 నిమిషాలలో పూర్తి చేయగా, ఈ పాట సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందట. తాజాగా ఈ పాటకు సంబంధించి రికార్డింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. కోలవెరి ఢీ పాటతో సంచలనం సృష్టించిన ధనుష్ , తేజూ కోసం తెలుగులో ఓ పాట పాడడం విశేషమే. తిక్క సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుండగా ఈ చిత్రంలో కథానాయికగా లారెస్సీ బొనేసీ, మన్నారా చోప్రా నటించింది.

1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles