త‌న‌లో దాగి ఉన్న మ‌రో టాలెంట్ బ‌య‌ట‌పెట్టిన ధ‌నుష్

Sat,September 1, 2018 10:12 AM
Dhanush becomes a musician for Vada Chennai movie

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడిగా కాకుండా కేవ‌లం త‌న టాలెంట్‌తో ఎంతో మంది మ‌న‌సులను గెలుచుకున్న నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట‌ర్ ధ‌నుష్‌. ఒక‌వైపు వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రిస్తూనే మ‌రో వైపు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, సింగ‌ర్‌గా, లిరిసిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంటారు . మ‌ల్టీ టాలెంటెడ్ అయిన ధ‌నుష్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. స‌మ‌యాన్ని బ‌ట్టి వాటిని బ‌య‌ట‌కు తీస్తుంటాడు. తాజాగా త‌నలో దాగి ఉన్న మ్యుజీషియ‌న్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. త‌మిళంలో వెట్రిమార‌న్ తెర‌కెక్కిస్తున్న వ‌డ చెన్నై చిత్రానికి ధ‌నుష్ సంగీతం అందించిన‌ట్టు సంతోష్ నారాయ‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. చిత్ర సంగీతం కోలీవుడ్ ల‌వ‌ర్స్‌కి మంచి ఆనందాన్ని ఇస్తుంద‌ని పేర్కొన్నాడు. ఐశ్వ‌ర్య రాజేష్‌, అందేరా జ‌రేమియాలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ మూవీగా అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డానియ‌ల్ బాలాజీ, స‌ముద్ర ఖ‌ని,కిషోర్, అమీర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌లో రూపొందుతుంది.

2552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS