అసుర‌న్‌గా ఆక‌ట్టుకుంటున్న ధ‌నుష్ లుక్

Sat,January 26, 2019 09:54 AM
dhanush asuran first look revealed

ద‌ర్శ‌కుడు, నిర్మాత‌,సింగ‌ర్, న‌టుడు ఇలా అనేక విభాగాల‌లో స‌త్తా చాటుతున్న ధ‌నుష్ ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అసుర‌న్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో ధ‌నుష్ సరికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. గ‌ళ్ళ లుంగీ పైకి క‌ట్టి బ‌ల్లెంతో దాడికి దిగుతున్న‌ట్టుగా ఉన్న ధ‌నుష్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నేటి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. కథానాయిక‌గా మ‌ల‌యాళ భామ మంజు వారియ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ధ‌నుష్ ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాకి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసుర‌న్ చిత్రం త‌ర్వాత ధ‌నుష్ స‌త్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ఓ చిత్రం, యువ దర్శకుడు రామ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ ఒక చిత్రం చేయనున్నారు. ఇక బ‌హుబాషా చిత్రంగా ధ‌నుష్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు,ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్న విష‌యం విదిత‌మే.

1432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles