శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sat,January 20, 2018 03:17 PM
శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మరాఠీ మూవీ సైరత్ రీమేక్ తో వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ధడక్ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందగా ఇందులో షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు. శశాంక్ కైతాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ చిత్ర కాన్సెప్ట్ నెగెటివ్ ఎండిగ్ తో ఉంటుందని సమాచారం . క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్స్ ఇద్దరిని పరువు పేరిట దారుణంగా చంపేస్తారట హీరోయిన్ కుటుంబ సభ్యులు. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, నిర్మాత కరణ్ జోహర్ కొత్త పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా తన ట్వీట్ ద్వారా తెలిపాడు. జూలై 20న ధడక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠీ మూవీలో సైరత్ అశేష విజయాన్ని అందుకోగా , హిందీలో ఎంత ఘన విజయం సాధిస్తుందో చూడాలి.


1215

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018