మెగా హీరో డెబ్యూ సినిమాలో మ‌ల‌యాళ భామ‌

Thu,April 18, 2019 11:33 AM
Devika Sanjay in talks for Vaishnav Tej film

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకి ప‌రిచ‌య‌మవుతున్న మ‌రో హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆయ‌న డెబ్యూ చిత్రం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. చిత్రానికి సుకుమార్ కథను అందించారు . రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స‌రికొత్త క‌థాంశంతో ఈ మూవీ రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. బెస్త‌వాళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా ఇందులో వైష్ణ‌వ్ బెస్తవాడిగా క‌నిపిస్తాడ‌ట‌. రంగ‌స్థ‌లం లాంటి ఎమోష‌న‌ల్ మూవీలా ఈ చిత్రం ఉంటుంద‌ని అంటున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

కొద్ది రోజులుగా ఈ సినిమాలో క‌థానాయిక కోసం ఎంపిక ప్ర‌క్రియ జ‌రుపుతుండ‌గా, మలయాళ బ్యూటీ దేవిక సంజయ్‌ని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ అమ్మ‌డు ఎన్‌జ‌న్ ప్ర‌కాశ‌న్ అనే మ‌ల‌యాళ చిత్రంతో బాగా పాపుల‌ర్ అయింది. ఫాహ‌ద్ ఫాజిల్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. సాయిధ‌ర‌మ్ త‌మ్ముడు అయిన‌ వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు. జానీ సినిమాలో చిన్నప్ప‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గా కూడా న‌టించాడు. ఇప్పుడు హీరోగా ఎలా అల‌రిస్తాడో చూడాలి.

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles