'ఎఫ్ 2'లోకి ఎంట్రీ ఇచ్చిన దేవి శ్రీ

Sat,June 9, 2018 12:19 PM
devi sri prasad join with f2 team

విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్. అయితే ఈ మూవీకి దేవి శ్రీ సంగీతం అందించ‌నున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు అనీల్ రావిపూడి. మీతో వర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగ‌తం అని ట్వీట్ చేశాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ రీసెంట్‌గా భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం చిత్రాల‌కి ప‌నిచేశాడు. ఈ రెండు చిత్రాల ఆల్బ‌మ్ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు ఎఫ్ 2కి కూడా దేవి శ్రీ మంచి బాణీలు అందిస్తాడ‌ని టీం భావిస్తుంది. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి మూవీతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత ఎఫ్ 2టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు టాక్.


2941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles