మేన‌ల్లుడి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన దేవి శ్రీ

Wed,May 22, 2019 08:24 AM
devi sri prasad FIDA WITH HIS NEPHEW PERFORMANCE

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ సంగీత ప్రియుల‌ని మాయ చేస్తుంటుంది. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. రాక్ స్టార్ మ్యూజిక్ వింటే అభిమానుల‌లో వైబ్రేష‌న్స్ క‌లుగుతాయి. మ‌రి ఆ రాక్ స్టారే త‌న మేన‌ల్లుడు వాయించిన ద‌రువుకి ఫిదా అయ్యాడ‌ట‌. వెంట‌నే త‌న మేన‌ల్లుడు దరువు వాయిస్తున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. నా మేన‌ల్లుడు తాన‌వ్ స‌త్యకి సంగీతం ఎవ‌రు నేర్పించ‌లేదు. వాడంత‌ట వాడే నేర్చుకుంటున్నాడు. నెల‌ల బాబుగా ఉన్న‌ప్ప‌టి నుండే ద‌రువు వేస్తు్న‌నాడు. వాడి వ‌య‌స్సు రెండున్న‌ర ఏళ్ళు. ప్ర‌స్తుతం వాడు జూనియ‌ర్ రాక్ స్టార్‌లా మారాడు. ఇది మా నాన్న ఆశీర్వాదంతోనే జరుగుతుంది అంటూ ట్వీట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. మ‌హ‌ర్షి స‌క్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న దేవి శ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో ఆనంద క్ష‌ణాల‌ని గడుపుతున్నాడు.2518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles