దేవీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సుక్కూ.. సాయంత్రం వీడియో విడుద‌ల‌

Sat,July 7, 2018 01:42 PM
devi sri concert video today evening released

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ప్ర‌తి ఏడాది విదేశాల‌లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నిర్వ‌హించే కన్స‌ర్ట్స్‌కి ఎంతో మంది సంగీత ప్రియులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఆగ‌స్ట్‌,సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నున్న షోకి ఇప్ప‌టి నుండే ప్ర‌చారం నిర్వ‌హించారు దేవి శ్రీ. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ద్వారా షోకు సంబంధించిన వివరాలను తెలియ జేస్తూ ఓ వీడియో రూపొందించామ‌ని, అందులో లెక్క‌ల మాస్టారు సుకుమార్ న‌టించార‌ని తెలిపారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం కార‌ణంగానే సుక్కూ ఇందులో న‌టించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కి ఆ వీడియోని స‌మంత చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నట్టు దేవి తెలిపారు. ఈ వీడియో మీ అంద‌రికి స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను అని దేవి అన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మంత‌, సుకుమార్‌కి ధ‌న్య‌వాదాలు కూడా తెలియ‌జేశారు.


2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles