ప్ర‌భుదేవా, త‌మ‌న్నా 'దేవి2' అఫీషియ‌ల్ టీజ‌ర్

Wed,March 27, 2019 08:32 AM
Devi 2  Official Teaser released

మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ప్ర‌భుదేవా కొరియోగ్రాఫ‌ర్‌గానే కాదు న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగాను రాణిస్తున్నాడు. కెరీర్‌లో ప‌లు పాత్ర‌లు పోషించిన ప్ర‌భుదేవా త‌మిళంలో మంచి స‌క్సెస్ సాధించిన దేవి చిత్రానికి సీక్వెల్‌గా దేవీ 2 అనే చిత్రం చేస్తున్నాడు. మ్యూజిక‌ల్ హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఐషారీ కే గ‌ణేష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ప్ర‌భుదేవా, త‌మ‌న్నాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించ‌నున్నార‌ని చెబుతున్నారు. కోవై స‌ర‌ళ‌, ఆర్‌జే బాలాజీ, నందిత చిత్రంలో ముఖ్య పాత్ర‌లు చేయ‌నున్నారు. మ‌రో వైపు ప్ర‌భుదేవా తొలిసారి ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఫ్లిక్‌లో పోలీస్ పాత్ర చేయ‌బోతున్నాడు. ఏసీ ముగ్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. మ‌రి తాజాగా విడుద‌లైన దేవీ2 టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles