గన్, విస్కీ బాటిల్ తో నాగ్..స్టెతస్కోప్ తో నాని..

Tue,August 7, 2018 04:54 PM
Devdas first look revealed

హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్లు నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్‌ దేవదాస్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున, నాని బెడ్ పై నిద్రిస్తున్నారు. నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో విస్కీ బాటిల్ పట్టుకోగా..నాని మెడలో స్టెతస్కోప్ తో ఉంది. సరికొత్తగా ఉన్న లుక్ దేవదాస్ పై అంచనాలను పెంచేస్తుంది.

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.






2387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles