హిందీ, త‌మిళంలో రీమేక్ కానున్న దేవ‌దాస్ చిత్రం

Wed,September 19, 2018 12:05 PM
DevaDas  Remakes In Tamil And Hindi

ఒక‌ప్పుడు మ‌నోళ్ళు బాలీవుడ్‌, కోలీవుడ్ చిత్రాలని ఎక్కువ‌గా రీమేక్ చేసి విజ‌యం సాధించేవాళ్ళు. కాని ఇప్పుడు ప‌రిస్థితి మారింది. మ‌న సినిమాల‌నే వారు రీమేక్ చేసి స‌క్సెస్‌ల‌ని సాధిస్తున్నారు. ఇటీవ‌ల అర్జున్ రెడ్డి, అత్తారింటికి దారేది, నిన్ను కోరి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాలు రీమేక్ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యాయి. తాజాగా నాగార్జున‌, నాని న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం దేవదాస్ త‌మిళం, హిందీలో రీమేక్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన దేవ‌దాస్ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌కి సిద్దం కాగా ఈ మూవీని వైజయంతి మూవీస్‌తో పాటు బాలీవుడ్ సంస్థ వ‌యాకామ్ 18 నిర్మిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ చేయాల‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నాడ‌ట‌. దేవ‌దాస్ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, చిత్రంలో నాని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన్న‌, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించారు . ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS