నాగ్‌, నాని మ‌ల్టీ స్టార‌ర్ మూవీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Thu,July 12, 2018 12:50 PM
Devadas Movie release date fixed

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీస్టారర్ చిత్రాల‌లో నాని, నాగ్ న‌టిస్తున్న మూవీ ఒక‌టి . శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది.

దేవ‌దాస్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన యూనిట్ స‌భ్యులు రీసెంట్‌గా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌పై గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోర్డింగ్ దర్శనమిచ్చాయి. ఈ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే దేవ్‌ అనే పాత్ర‌లో డాన్‌గా నాగ్‌, దాస్ అనే పాత్ర‌లో డాక్ట‌ర్‌గా నాని క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్ర నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా సెప్టెంబ‌ర్ 27 చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 1953లో ఏఎన్ఆర్ న‌టించిన చిత్రం దేవ‌దాసు. తెలుగు సినిమాలో క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ చిత్ర టైటిల్‌ని ఆయ‌న త‌న‌యుడు నాగార్జున వాడుకోవ‌డం విశేషం.


1934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles