'దేవ‌దాస్' నుండి ఫ‌స్ట్ సాంగ్‌..

Thu,August 30, 2018 11:36 AM
Devadas Movie first song released

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలలో నాని, నాగ్ నటిస్తున్న దేవదాస్ మూవీ ఒకటి . శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు.

చిత్ర నిర్మాణం చివరి దశలో ఉండగా సెప్టెంబర్ 27 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల స్మాల్ పెగ్ అంటూ టీజ‌ర్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈరోజు సాయంత్రం ఆరుగంట‌ల‌కి చిత్రానికి సంబంధించి తొలి సాంగ్ వీడియో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS