నాగ్, నాని సినిమా ఫస్ట్ లుక్ టైం ఫిక్స్..

Sun,August 5, 2018 04:13 PM
devadas firstlook to reveale on august 7th

టాలీవుడ్ యాక్టర్లు నాగార్జున, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం దేవదాస్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తన అభిమానులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన నాగార్జున కొత్త సినిమా ఫస్ట్ లుక్ సమయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఆగస్టు 7న సాయత్రం 4 గంటలకు దేవదాస్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.


2659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles