దేవ‌దాస్‌కి ప్యాక‌ప్ చెప్పిన నాగ్, నాని

Wed,September 12, 2018 09:15 AM
Deva das  shooting completed

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో దేవ‌దాస్ ఒక‌టి. నాని, నాగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైన‌ట్టు నాగార్జున టీం అంద‌రితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తెలిపాడు. మ‌రోవైపు నాని టీంతో క‌లిసి దిగిన ఫోటోని ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు . సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.


2062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles