స్టైలిష్‌గా ఉన్న దేవ్ ట్రైల‌ర్‌

Fri,February 1, 2019 08:13 AM
Dev   Theatrical Trailer  released

సూర్య సోద‌రుడు కార్తీ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దేవ్‌. ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించింది. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ సూర్య చేతుల మీదుగా విడుద‌లైంది. ఇందులో డైలాగ్స్‌తో పాటు స‌న్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. హరీష్ జైరాజ్ మ్యూజిక్, ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ప్రేమికులు రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవ్. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. నిక్కీ గల్రాని కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.


1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles