టీజ‌ర్‌తో అల‌రించేందుకు సిద్ద‌మైన 'దేవ్'

Sat,November 3, 2018 09:55 AM
dev teaser release date fixed

చినబాబు చిత్రం తర్వాత కోలీవుడ్ యాక్టర్ కార్తి నటిస్తోన్న చిత్రం ‘దేవ్’. రజత్‌ రవి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఖాకీ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండ‌గా, న‌వంబ‌ర్ 5న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించాల‌ని మేక‌ర్స్ భావించారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా , ఇందులో చేతిలో హెల్మెట్‌ పట్టుకుని స్పోర్ట్స్‌ బైక్‌ వద్ద కార్తి నిలబడిన పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. తన అభిమాన క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్ఫూర్తితోనే ఈ సినిమాకు ‘దేవ్‌’ టైటిల్‌ను దర్శకుడు రజత్‌ రవి శంకర్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

1204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles