వివక్షకు వ్యతిరేకంగా గోల్డెన్ గ్లోబ్ వేడుక దుస్తుల వేలం

Fri,January 19, 2018 03:58 PM
Designers to auction off Golden Globes black dresses

దాదాపు ప్రతి దేశంలోనూ ఏదోక రూపంలో అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్షత నానాటికీ పెరుగుతున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ కొన్ని దేశాల్లో నిరసనలు, ప్రతిఘటనలూ, ఆందోళనలూ చేస్తున్నారు. సినీరంగంలో లైంగిక వేధింపులూ, పారితోషికంలో వివక్షను ప్రతిఘటిస్తూ హాలీవుడ్ లో ప్రముఖ నటీమణులు ఇటీవల ఉద్యమించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగానే 'మీ టూ', 'టైమ్స్ అప్' ప్రచారాలు పుట్టుకొచ్చాయి. వాటికి ఆదరణ కల్పించడం కోసం సమాయత్తమయ్యారు. కొద్ది రోజుల కిందట జరిగిన గోల్డెన్ గ్లోబ్ వేడుకకు అందరూ నల్ల రంగులు దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో ఆ ప్రచారాలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వేడుకలకు బ్లాక్ డ్రెస్ తో వచ్చిన వారు తాము వేసుకొచ్చిన నల్ల రంగు వస్త్రాలను వేలం వేయాలనుకుంటున్నారు. ఆ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని 'పారితోషికంలో లింగ సమానత్వం' సాధించే ప్రచారానికి ఉపయోగించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఈబే వెబ్ సైట్లో వేలాన్ని ప్రారంభించారు. వారు చేస్తున్న ఈ సత్కార్యానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles