విడాకులు తీసుకునేందుకు సిద్ద‌మైన మ‌రో బాలీవుడ్ జంట‌

Wed,May 22, 2019 11:35 AM
Delhi Belly actor Imran Khan and wife Avantika Malik parted ways

సౌత్‌తో పోలిస్తే నార్త్ సెల‌బ్రిటీలే ఎక్కువ‌గా విడాకుల బాట ప‌డుతుంటారు. ప్రేమ‌, పెళ్లి ఆ త‌ర్వాత విడాకులు. వీటి మ‌ధ్య వ్య‌త్యాసం కొన్ని రోజులు మాత్ర‌మే. ఇప్పుడు 8 సంవ‌త్స‌రాలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ పాప‌కి కూడా జ‌న్మనిచ్చిన బాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మైంద‌ని బీటౌన్ టాక్. మేట‌ర్‌లోకి వెళితే జానే తు యా జానే నా సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఇమ్రాన్ ఖాన్ త‌క్కువ స‌మ‌యంలో ల‌వ‌ర్ బోయ్‌గా మారాడు. ఎంద‌రో అమ్మాయిల మ‌న‌సులు దోచుకున్న ఇమ్రాన్ తాను 8 ఏళ్ళుగా ప్రేమించిన అవంతిక మాలిక్‌ని జ‌న‌వ‌రి 10,2011న వివాహ‌మాడాడు. 2014లో వీరికి ఓ పాప కూడా జ‌న్మించింది. అయితే పెళ్లైన మొద‌ట్లో వీరి సంసారం స‌జావుగానే సాగిన ఆ త‌ర్వాత చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయ‌ట‌. హీరోగా అవ‌కాశాలు లేక‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా అవ‌కాశాలు కరువ‌వ్వ‌డంతో ద‌ర్శ‌కుడిగా మారాడు ఇమ్రాన్‌. అయితే ప్రొఫెష‌న‌ల్ లైఫ్ అంత బాగోలేక‌పోవ‌డంతో ఆ ఒత్తిడిని త‌న భార్య‌పై చూపించాడ‌ట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌త‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో అవంతిక తన ఐదేళ్ల కూతురుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది అవంతిక‌. ఇమ్రాన్ సొంత మావ‌య్య అమీర్ ఖాన్ వారిద్దరికి నచ్చ‌జెప్పి సంసారాన్ని చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నం చేసిన అది వ‌ర్కవుట్ కాలేద‌ట‌. ఇక వారిద్ద‌రు విడాకులు తీసుకోవ‌డం ఖాయమ‌ని అంటున్నారు . చూడాలి మ‌రి దీనిపై ఇమ్రాన్ స్పందిస్తాడా లేదా!

5111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles