న‌వంబ‌ర్ 20న దీప్‌వీర్ వివాహం..!

Tue,August 14, 2018 12:20 PM
deepveer marriage on november 20

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లికి సంబంధించిన షాపింగ్ ఇప్ప‌టికే పూర్తైంద‌ని , న‌వంబ‌ర్ 10న ఉత్త‌ర ఇట‌లీలోని లంబార్టీ అనే ప్ర‌దేశంలో అబ్బుర‌ప‌ర‌చే ప్ర‌కృతి అందాల మ‌ధ్య వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొద్దిరోజుల క్రితం పుకార్లు షికారు చేశాయి . స‌ర‌స్సు చుట్టూ ఉన్న వ‌స‌తులు, లాడ్జిలు, విల్లాలు ఇప్ప‌టికే బుక్ చేసారని కూడా అన్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం దీప్ వీర్ వివాహంకి సంబంధించిన ముహూర్తం న‌వంబ‌ర్ 20న ఫిక్స్ చేశార‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లనున్నాయట‌.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్న దీప్ వీర్ జంట ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వ‌ర‌లో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయ‌నున్నారని అంటున్నారు. పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా వెన్ను నొప్పి నుండి కోలుకుంటున్న దీపికా త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది.

2387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles