షాకింగ్ నిర్ణ‌యం: ఈ రోజు హౌజ్ నుండి ఒక‌రు ఔట్‌ ?

Thu,September 27, 2018 01:04 PM
Deepthi Nallamothu eliminated from bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 మొద‌లు కాక‌ముందు నుండే నాని ఇక్క‌డ ఏదైన జ‌ర‌గొచ్చు అని ప్రోమోల‌లో చెప్పుకుంటూ వ‌చ్చాడు. అన్నట్టుగానే బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. అయితే ఫైన‌ల్‌కి మ‌రో మూడు రోజులు మాత్ర‌మే ఉండ‌గా, విజేత ఎవ‌ర‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ కౌశ‌ల్, సామ్రాట్‌, దీప్తి, గీతా మాధురి, త‌నీష్ లు ఉండ‌గా వీరిలో ఒక్కరు మాత్ర‌మే బిగ్ బాస్ టైటిల్ అందుకోనున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్‌ల అభిమానులు త‌మ ఫేవ‌రేట్ స‌భ్యుడికి అధికంగా ఓటింగ్స్ వేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు.

సాధారణంగా ప్ర‌తి శ‌నివారం లేదా ఆదివారం రోజుల‌లో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ ఉండ‌నుండ‌గా, అంద‌రికి షాకింగ్ ఇచ్చేలా ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేష‌న్ కానున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌(వారం మధ్యలో ఎలిమినేషన్‌) కానున్న ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు టీవీ 9 యాంక‌ర్ దీప్తి. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు ఉంటారని ముందుగా చెప్పిన‌ప్ప‌టికి, బిగ్ బాస్ ఇలా అర్ధాంత‌ర నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఓ కార‌ణం చెబుతున్నారు నెటిజ‌న్స్ . ఫేక్ ఓటింగ్ వ‌ల‌న దీప్తిని మ‌ధ్య‌లోనే పంపిచేస్తున్నార‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముందో తెలియ‌దు కాని సోష‌ల్ మీడియాలో దీనిపై విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

7053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles