యాసిడ్ బాధితురాలి పాత్ర‌లో దీపికా

Fri,December 14, 2018 10:52 AM
deepika plays key role in acid girl biopic

బాలీవుడ్ హీరో ర‌ణవీర్ సింగ్‌ని వివాహం చేసుకొని ఓ ఇంటిదైన బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే చివ‌రిగా ప‌ద్మావ‌త్‌ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. రాణి ప‌ద్మావ‌తిగా దీపిక న‌ట‌న ప్ర‌తి ఒక్కరిని అల‌రించింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు దీపిక‌కి ఎన్నో బెదిరింపులు వ‌చ్చిన ,వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కింది. ఆమె ధీర‌త్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఇక దీపిక త‌న త‌దుప‌రి చిత్రంగా సప్నా దీదీ అనే బయోపిక్ చేయనుందని అన్నారు. ముంబయిలోని నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా ఈ సినిమాను విశాల్ భరద్వాజ్ తెరకెక్కించనుండ‌గా, వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జ‌రిగిన యాసిడ్ దాడిలో గాయ‌ప‌డ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నున్న చిత్రంలో దీపికా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచిన ఆమె జీవితంకి సంబంధించిన చిత్రాన్ని మేఘ‌నా గుల్జార్ తెరకెక్కించ‌నున్నాట‌. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించనుంది. సినిమాలో యాసిడ్ బాధితుల గురించి లార్జ్ స్కేల్‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కులు భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ ప్రాజెక్టుల‌పై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles