సిద్ధి వినాయకుని గుడిలో దీపికా

Tue,January 23, 2018 02:23 PM
Deepika Padukone visits famous Siddhi Vinayak Temple in Mumbai ahead of Padmaavat Release

పద్మావత్ రిలీజ్‌కు రెండు రోజుల ముందు ఆ మూవీ లీడ్ యాక్టర్ దీపికా పదుకొనె ముంబైలోని సిద్ధి వినాయకుని గుడికి వెళ్లింది. వైట్ డ్రెస్‌లో సింపుల్‌గా కనిపించిన దీపికా.. అక్కడున్న మీడియా, అభిమానులను పట్టించుకోకుండానే వెళ్లిపోయింది. ఈ మూవీకి మొదటి నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదురైన విషయం తెలిసిందే. రాజ్‌పుత్ కర్ణిసేన ఇప్పటికీ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని చెబుతున్నది. సీబీఎఫ్‌సీతోపాటు సుప్రీంకోర్టు కూడా మూవీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపికా.. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


1853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles