దీపికా మైనపు విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానన్న రణ్‌వీర్.. వీడియో

Thu,March 14, 2019 06:36 PM

దీప్‌వీర్ జంట ప్రస్తుతం వాళ్ల ఫ్యామిలీతో కలిసి లండన్‌లో ఉన్నారు. ఈసందర్భంగా దీప్‌వీర్ జంట లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో దీపికా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీపికా మైనపు విగ్రహాన్ని చూసి దీప్‌వీర్ జంట ఆశ్చర్యపోయింది. దీపికా.. మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించగానే.. రణ్‌వీర్ సింగ్ ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చా అంటూ చమత్కరించారు. దీంతో అక్కడ అందరూ కాసేపు చిరునవ్వు చిందించారు. వెంటనే దీపికా.. రణ్‌వీర్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు షూటింగ్‌లో ఉన్నప్పుడు నన్ను మిస్సయ్యావని అనిపిస్తే.. ఇక్కడకు వచ్చి నా మైనపు విగ్రహాన్ని చూడు.. అంటూ బదులిచ్చింది దీపికా. దీప్‌వీర్ మేడమ్ టుస్సాడ్స్‌లో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఐఐఎఫ్‌ఏ 2016 అవార్డ్స్‌లో దీపిక పాల్గొన్నప్పటి లుక్‌తోనే ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. అప్పుడు సవ్యసాచి డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని రెడ్ కార్పెట్‌పై హొయలు పలికింది దీపిక. గత సంవత్సరం జులైలో దీపికా.. మేడమ్ టుస్సాడ్స్ టీమ్‌ను కలిసి తన కొలతలు ఇచ్చింది. తాజాగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది.

మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.

దీపికా సినిమాల విషయానికి వస్తే.. దీపికా చివరగా నటించిన సినిమా పద్మావత్. ప్రస్తుతం చపాక్ అనే సినిమాలో దీపికా నటిస్తోంది. యాసిడ్ అటాక్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతోంది.

View this post on Instagram

❤️ @madametussauds

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


View this post on Instagram

😝 @madametussauds

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


View this post on Instagram

🙏🏽 @madametussauds

A post shared by Deepika Padukone (@deepikapadukone) on
View this post on Instagram

#deepikapadukone #RanveerSingh

A post shared by #DeepVeer👩‍❤️‍💋‍👩💃🏻 (@deepikapadukones_world) on
View this post on Instagram

It’s all about the details 🤔😁

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles