భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకొనే..!

Sun,October 2, 2016 05:11 PM
Deepika Padukone to act in big Tamil Period Film


చెన్నై: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం హాలీవుడ్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత దీపికా పదుకొనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న మూవీలో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో రానున్న కొత్త మూవీలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు పేర్కొన్నాయి.

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ బాహుబలి, ఎంథిరన్ ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం డైరెక్టర్ సుందర్ తెలుగు, తమిళ భాషల్లో నుంచి టాప్ స్టార్లను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం దీపికా పదుకొనేను సంప్రదించగా..ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ సినీ వర్గాలు వెల్లడించాయి. తాజా సినిమా ‘ ‘కొచ్చాడియాన్’ తర్వాత దీపికా పదుకొనే తమిళంలో నటిస్తున్న రెండో చిత్రం కానుంది .

2021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles