దీపిక బ్యాగ్ ఖ‌రీదు తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

Fri,February 22, 2019 01:40 PM
Deepika Padukone pairs her stunning with Rs 3 lakh bag

ఈ కాలం న‌టీమ‌ణులు వారి దుస్తులు లేదా వ‌స్తువుల‌తో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ప్రియాంక చోప్రా 7 కోట్ల నెక్లెస్ ధ‌రించి హాట్ టాపిక్‌గా నిలిచింది. అలియా భ‌ట్ 1890 అమెరికన్‌ డాలర్స్(మ‌న క‌రెన్సీ ప్ర‌కారం 1,39,170 రూపాయ‌లు) ధ‌ర ఉన్న బ్యాగ్ ధ‌రించి ముంబై విమానాశ్ర‌యంలో మెరిసింది. ఈ బ్యాగ్ గురించి సోష‌ల్ మీడియాలో భారీ చ‌ర్చే జ‌రిగింది. ఇక తాజాగా బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణే 3 ల‌క్ష‌ల బ్యాగ్‌తో ఎయిర్ పోర్ట్‌లో త‌ళుక్కుమంది. ఇప్పుడు ఈమె బ్యాగ్ గురించి కూడా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ న‌డుస్తుంది. ప‌ద్మావ‌త్ చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన దీపిక ప్ర‌స్తుతం ఛపాక్ అనే సినిమాలో నటిస్తోంది. అందులో లక్ష్మి అగర్వాల్ అనే యాసిడ్ దాడికి గురైన బాధితురాలి పాత్ర పోషిస్తుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ తో క‌లిసి ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం కూడా ఆమె చేయ‌నుంద‌ని అంటున్నారు. అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles