రెడ్ హ్యాండెడ్ గా దొరికినందుకే అతడికి దూరమయ్యా: దీపిక

Wed,July 25, 2018 03:47 PM
Deepika Padukone opened up on Ranbir Kapoor  infidelity

పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణే ప్రస్తుతం రణ్వీర్ సింగ్ తో ప్రేమాయణంలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిరివురు పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది.అయితే దీపిక గతంలో చాక్లెట్ బాయ్ రణ్ బీర్ తో పీకల్లోతు ప్రేమలో ఉండేది. 2007వ సంవత్సరంలో పలు పత్రికలు వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేక కథనాలే రాసాయి. కొన్నేళ్ళ తర్వాత వీరి ప్రేమకి బ్రేక్ పడింది. తర్వాత అతనిపై పలు విమర్శలు చేసింది. తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ తో బ్రేకప్ గురించి వివరించింది.

సెక్స్ అనేది నాకు సంబంధించినంత వరకు శారీరకం వరకే కాదు, అందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. నేను ఒకరితో బంధంలో ఉన్నప్పుడు ఎవరిని మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ రిలేషన్ షిప్ కి విలువేముంది. అలాంటప్పుడు సింగిల్ గా ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయోచ్చు. రణ్ బీర్ ఒకసారి నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. రెండో అవకాశం ఇవ్వమని ప్రాథేయపడ్డాడు. ఆ ఘటనతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మోద్దని తెలిసి రణ్ బీర్ కి దూరమయ్యాను. మానసికంగా కుంగిపోయిన నేను ఆ విషాదం నుండి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది దీపిక.

6887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles